ఢిల్లీ హైకోర్టులో ట్విటర్ కాళ్ల బేరం
న్యూఢిల్లీ: ఇండియాలో ఫిర్యాదులు స్వీకరించే అధికారిని నియమించేందుకు రెండు నెలల సమయం ఇవ్వాలని ట్విటర్ యాజమాన్యం ఢిల్లీ హైకోర్టును వేడుకున్నది. ఐటి నిబంధనలకు అనుగుణంగా ఇండియాలో అనుసంధాన కార్యాలయం ఏర్పాటు చేస్తామని విన్నవించుకున్నది.
నూతన ఐటి నిబంధనల విషయంలో ట్విటర్ ఇప్పటి వరకు మేకపోతు గాంభీర్యం ప్రదర్శించింది. తమది ప్రపంచ స్థాయి సంస్థ అని, పాటించేది లేదని ప్రగల్భాలు పలికింది. ఈ వ్యవహారంపై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన ఐటి నిబంధనలను ట్విటర్ ధిక్కరించాలని అనుకుంటున్నదా హైకోర్టు ప్రశ్నించింది. నిబంధనలు అమలు చేయడం లేదని, అమలు చేసేందుకు ప్రక్రియ మొదలు పెట్టామని చెప్పగా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫిర్యాదులు స్వీకరించే అధికారి నియమకానికి మీరు కోరిన విధంగా గడువు ఇవ్వడం కుదరదని స్పష్టం చేసింది. జూలై 6వ తేదీన తాత్కిలక అధికారిని నియమించామని తెలిపింది. కేంద్ర ప్రభుత్వ మధ్యవర్తిత్వం కోల్పోవడంతో ట్విటర్ పలు కేసులను వివిధ కోర్టులలో ఎదుర్కొంటున్నది.