హైతీ ప్రెసిడెంట్ ను విదేశీ ముఠా ఎందుకు చంపింది?

పోర్టు ఆఫ్ ప్రిన్స్: హైతీ అధ్యక్షుడు జోవెనల్ మొయిజ్ ను విదేశీ ముఠా ఎందుకు హత్య చేసిందనే దానిపై పలు కోణాల్లో విచారిస్తున్నారు. ఈ హత్యలో కొలంబియాకు చెందిన మాజీ మిలిటరీ సైనికులు, ఇద్దరు అమెరికన్లు పాల్గొనడం దేశంలో చర్చనీయాంశంగా మారింది.

అధ్యక్షుడు మొయిజ్ ను విదేశీ ముఠా ఎందుకు టార్గెట్ చేశారనేది నిఘా వర్గాలు, పోలీసులు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. రెండు రోజుల క్రితం నల్ల దుస్తుల్లో వచ్చిన దుండకులు అధ్యక్షుడి ఇంట్లోకి ప్రవేశించి విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో ఆయనతో పాటు భార్య శరీరంలో బుల్లెట్లు దిగాయి. మొయిజ్ శరీరంలో 12 బుల్లెట్లు దిగాయి. ఈ ముఠాలో మొత్తం 28 మంది కొలంబియన్లు, ఇద్దరు అమెరికన్లు ఉన్నారు. దాడిలో పాల్గొన్న వారిలో 17 మందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. మరో 8 మంది పరారీలో ఉన్నారు. వారిని పట్టుకునే సమయంలో పారిపోతుండగా నలుగురిని హతమర్చారు. ముఠా నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలు ఎవరు సమకూర్చారు, దేశంలోకి ఎప్పుడు వచ్చారు, అధ్యక్షుడి కుటుంబ కదలికలపై సమాచారం ఎవరిచ్చరనే కోణాల్లో లోతుగా విచారణ జరుగుతోంది. దేశంలో అస్థిరత సృష్టించేందుకు చేశారా, ఆర్థిక లావాదేవీల కారణమా అనేదానిపై లోతుగా విశ్లేషిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.