థర్డ్ వేవ్ ప్రారంభమైంది: డబ్ల్యుహెచ్ఓ

జెనీవా: కరోనా థర్డ్ వేవ్ ప్రారంభం అయ్యిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఓ) చీఫ్ టెడ్రోస్ అథానమ్ హెచ్చరించారు. మనం థర్డ్ వేవ్ తొలి దశలో ఉన్నామని చెప్పేందుకు చింతిస్తున్నట్లు ఆయన తెలిపారు.

ప్రపంచ వ్యాప్తంగా ప్రభుత్వాలు ఆంక్షలు ఎత్తివేయడం, పరిరక్షణ చర్యలు కఠినంగా తీసుకోకపోవడం, భౌతిక దూరం పాటించకపోవడం వంటి కారణాలతో మరణాల సంఖ్య పెరుగుతున్నదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వ్యాక్సినేషన్ కారణంగా యూరప్ దేశాల్లో కేసులు తగ్గుముఖం పట్టాయని, ప్రస్తుత పరిస్థితులు ఇందుకు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాయన్నారు. వైరస్ లు రూపు మార్చుకుంటుండడంతో కొత్త కొత్త వేరియంట్లు వస్తున్నాయని ఆయన అన్నారు. ఇప్పటికే 111 దేశాల్లో డెల్టా వేరియంట్ కేసులు వస్తున్నాయని, మున్ముందు మరిన్ని దేశాలకు విస్తరిస్తుందని టెడ్రోస్ హెచ్చరించారు. డెల్టాతో పాటు బీటా, గామా వేరియంట్లు కూడా విజృంభిస్తున్నాయని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.