ఒకేసారి నాలుగు డివైజ్ లలో వాట్సప్

వినియోగదారుల డిమాండ్ కు అనుగుణంగా వాట్సప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తున్నది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మల్టీ డివైజ్ ఫీచర్ రానే వచ్చేసింది.

తమ మొబైల్ ఫోన్ లోనే కాకుండా మరో నాలుగు డివైజ్ లలో వాట్సప్ ను చూడవచ్చు. కొద్ది రోజులుగా దీనిపై వార్తలు వస్తున్నప్పటికీ తాజాగా వాట్సప్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. తాజాగా బీటా యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చిందని తెలిపింది. ప్రస్తుతం డెస్క్ టాప్, ల్యాప్ టాప్ లో చూడాలనుకుంటే నెట్ సౌకర్యం ఉండాలి. తాజా ఫీచర్ ప్రకారం నెట్ లేకపోయానా, స్విచ్ ఆఫ్ అయినా డెస్క్ టాప్, ల్యాప్ టాప్ లో వాట్సప్ వినియోగించుకోవచ్చు. అన్ని డివైజ్ లలో మెసేజి హిస్టరీ, కాంటాక్ట్స్ నేమ్, స్టార్ మెసేజీలు సింక్ అయ్యేలా టెక్నాలజీ అభివృద్ధి పర్చారు.

Leave A Reply

Your email address will not be published.