తెలుగు-సంస్కృత అకాడమీ ఏర్పాటులో తప్పేమిటి?

అమరావతి: తెలుగు అకాడమీ పేరును తెలుగు-సంస్కృత అకాడమీగా విస్తరించటం వల్ల వచ్చిన నష్టం ఏమిటో వీరు వివరించాలని తెలుగు-సంస్కృత అకాడమీ అధ్యక్షురాలు నందమూరి లక్ష్మీపార్వతి లేవనెత్తారు.
తెలుగు-సంస్కృత అకాడమీ ఏర్పాటును తప్పు పడుతూ కొందరు మీడియా ద్వారా చేసిన వ్యాఖ్యలు చూశానన్నారు.

నష్టం ఏమిటో చెప్పకుండా ఏదో ఘోరం జరిగిపోయినట్లు ఎందుకు ప్రకటనలు చేస్తున్నారో కూడా చెప్పాలన్నారు. తెలుగు భాషాభివృద్ధికి, దానితో పాటు సంస్కృత భాషాభివృద్ధికి కూడా జగన్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం నిజానికి అందరూ అభినందించవలసిన విషయం ఉందన్నారు. అకారణమైన, నిర్హేతుకమైన విమర్శలను చేయవద్దని నందమూరి లక్ష్మీపార్వతి సవినియంగా మనవి చేశారు.

Leave A Reply

Your email address will not be published.