అమెరికాలో జంతువులకు కూడా వ్యాక్సిన్లు!

శాన్ ఫ్రాన్సిస్కో: ఇప్పటి వరకు మనుషులకు మాత్రమే కరోనా వైరస్ రాకుండా వ్యాక్సిన్లు వేయడం విన్నాం. కాని అమెరికాలో జంతు ప్రదర్శనశాలలో ఉన్న జంతువులకు కూడా వ్యాక్సిన్లు ఇస్తున్నారు.

జూ లోని జంతువులకు వాటి రోగ నిరోధక శక్తి ఆధారంగా ఎంపిక చేసి దాని ప్రకారం వ్యాక్సిన్లు ఇస్తున్నట్లు డాక్టర్ అలెక్స్ హెర్మాన్ వెల్లడించారు. జోటీస్ అనే సంస్థ ప్రత్యేకంగా జంతువుల కోసం ఒక వ్యాక్సిన్ తయారు చేసిందని ఆమె తెలిపారు. ఒక్లాండో జూ లో మొదటి విడతగా 100 డోసులు చేరుకున్నాయి. 70 జూ లలో ఉన్న జంతువులకు వ్యాక్సిన్ ఇచ్చేందుకు 11వేల డోసులను పంపించారు. ముందు జాగ్రత్త చర్యగా కరోన వైరస్ ను నియంత్రించేందుకు వ్యాక్సిన్ ఇస్తున్నట్లు డాక్టర్ అలెక్స్ హెర్మాన్ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.