40 కోట్ల మందికి వ్యాక్సిన్ రక్షణ: మోదీ

న్యూఢిల్లీ: దేశంలో ఇప్పటి వరకు 40 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్లు ఇచ్చినట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. వ్యాక్సిన్లు భుజాలకు ఇస్తున్నందున వారు బాహుబలులు అయ్యారన్నారు.

ఇవాళ పార్లమెంటు సమావేశాల ప్రారంభం సందర్భంగా మోదీ మీడియాతో మాట్లాడారు. ప్రతి ఒక్కరు ఒక డోసు వ్యాక్సిన్ తీసుకుని ఉంటారని, దేశ వ్యాప్తంగా 40 కోట్ల మందికి ఇచ్చామన్నారు. పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగేందుకు ప్రతి ముఖ్యమంత్రితో ఫోన్ లో మాట్లాడానన్నారు. ప్రపంచం అంతా ఈ మహమ్మారితో ఇప్పటికే సతమతమవుతుందని, ఈ అంశంపై చర్చ జరగాలన్నారు. ప్రతి పార్టీకి చెందిన నాయకుడు ప్రశ్నలు వేయాలని, వాటికి ప్రభుత్వం కూడా సమాధానం ఇచ్చేలా సభాపతి అనుమతించాలన్నారు. క్రమశిక్షణా వాతావరణలో సభ జరగాలని కోరుకుంటున్నానని, ఇది ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందన్నారు.

Leave A Reply

Your email address will not be published.