సెప్టెంబర్ లో 12 ఏళ్ల వారికి వ్యాక్సినేషన్

న్యూఢిల్లీ: దేశంలో సెప్టెంబర్ నెల నుంచి 12 సంవత్సరాలు దాటిన వారికి వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమవుతుంని కేంద్రం తీపి కబురు చెప్పింది. 12 నుంచి 18 ఏళ్ల వయస్సు వారికి వ్యాక్సిన్లు ఇవ్వనున్నారు.

థర్డ్ వేవ్ చిన్నారులపై అధికంగా ప్రభావం చూపిస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో కొన్ని నెలలుగా బాలుర కోసం వ్యాక్సిన్లపై ప్రయోగాలు జరుగుతున్నాయి. వ్యాక్సిన్ల ప్రయోగాలు తుది దశకు రావడంతో నేషనల్ ఎక్స్ పర్ట్ గ్రూప్ చీఫ్ ఎన్.కె.అరోరా కీలక ప్రకటన చేశారు. త్వరలోనే జైడస్ క్యాడిలా రూపొందించిన వ్యాక్సిన్ కు అనుమతులు లభించనున్నట్లు అరోరా వెల్లడించారు. సెప్టెంబర్ కల్లా క్లినికల్ ట్రయల్స్ పూర్తవుతాయన్నారు. ఈ వ్యాక్సిన్ కేవలం 12 నుంచి 18 సంవత్సరాల లోపు వారికి మాత్రమేనని ఆయన స్పష్టం చారు. దేశంలో స్కూళ్లను తెరిచే అంశంపై ఎప్పటికప్పుడు చర్చిస్తున్నామని, వ్యాక్సినేషన్ పూర్తి కాకుండా తెరవడం కష్టసాధ్యమని అరోరా తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.