యుఎస్… 3 వారాల్లో రెట్టింపు కేసులు

వాషింగ్టన్: కరోనా మహమ్మారితో చిగురుటాకులా వణికిన అమెరికా దేశం వ్యాక్సినేషన్ తో వైరస్ తీవ్రత అదుపులోకి వచ్చింది. ప్రపంచంలోనే అత్యధిక కేసులతో పాటు మరణాలు కూడా నమోదు చేసుకుని చరిత్ర సృష్టించింది.

మాస్క్ ధరించాల్సిన పనిలేదని, జన సమూహంలో ఉన్నప్పుడు మాత్రమే మాస్క్ పెట్టుకోవాలని ప్రభుత్వం గత నెలలో ప్రకటించిన విషయం తెలిసిందే. పరిస్థితి కుదుటపడిందని అనుకుంటున్న సమయంలో మళ్లీ కరోనా వైరస్ పడగ విప్పుతోంది. గత మూడు వారాలుగా కేసులు పెరిగాయి. మూడువారాల్లోనే కేసులు రెట్టింపుకావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటి వరకు దేశంలోని 55 శాతం మంది ప్రజలకు సింగిల్ డోసు ఇచ్చారు. వ్యాక్సినేషన్ లో అగ్రస్థానంలో ఉంది కూడా. ఇక్కడా అక్కడా అనే తేడా లేకుండా ప్రజలు గుమిగూడే ప్రాంతాలలో వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతున్నది. జాన్ హప్కిన్స్ యూనివర్సిటీ లెక్కల ప్రకారం గత నెలలో ప్రతి రోజు 11వేల కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. ఈ నెలలో ప్రతి రోజు 23వేల కేసులు నమోదు అవుతున్నాయి. సౌత్ డకోటా, మిసిసిపీ, మైమీ ప్రాంతాల్లో రెండు వారాలుగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. వ్యాక్సినేషన్ తక్కువగా ఉన్న ప్రాంతాల్లో పాజిటివ్ కేసుల ఎక్కువగా వస్తున్నాయి. కేసులు పెరగడంతో మూడు వారాల్లో హాస్పిటల్ లో చేరేవారి సంఖ్య 150 శాతం పెరగడం ఆందోళన కలిగించే అంశంగా చెప్పుకోవచ్చు.

Leave A Reply

Your email address will not be published.