యూపిలో బిజెపిని తరిమికొడతాం: నిషాద్ పార్టీ
లక్నో: తమ పార్టీ కార్యకర్తలు ఇప్పటికే రాష్ట్రంలో బిజెపి వెంటపడుతున్నారని, బిజెపి నాయకత్వం తన తప్పులను సరిదిద్దుకోకపోతే తరిమికొడతామని యుపి నిషాద్ పార్టీ అధినేత సంజయ్ నిషాద్ హెచ్చరించారు.
కేంద్రంలో మంత్రివర్గ విస్తరణ జరిగిన తరువాత అప్నాదళ్ పార్టీ నుంచి అనుప్రియ పటేల్ ను మంత్రివర్గంలోకి తీర్చుకుని, మిత్రపక్షమైన తమను నిర్లక్ష్యం చేయడంతో సంజయ్ ఆగ్రహంతో ఉన్నారు. అప్నాదళ్ ను చేర్చుకుని తమను ఎందుకు చేర్చుకోలేదని ఆయన ప్రశ్నించారు. తప్పులు సరిదిద్దుకోనట్లయితే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని సంజయ్ హెచ్చరించారు. తమ పార్టీ 160 అసెంబ్లీ సీట్లలో అత్యధిక ఓట్లను సాధించిందని, అప్నాదళ్ కు అంతగా ప్రజా బలం లేకున్నా మంత్రి పదవి కట్టబెట్టారని మండిపడ్డారు. ఈ విషయాన్ని బిజెపి చీఫ్ జెపి.నడ్డా, హోం శాఖ మంత్రి అమిత్ షా కు తెలియచేశానని, ఇక వారి ఇష్టమని సంజయ్ వ్యాఖ్యానించారు.