కేంద్ర ఐటి మంత్రికి ట్విటర్ షాక్
న్యూఢిల్లీ: ఇంతకు ముందు కేంద్ర ఎలక్ట్రానిక్, ఐటి శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కు బ్లూ వెరిఫైడ్ బ్యాడ్జిని తొలగించిన ట్విటర్ తాజాగా మరో కేంద్ర మంత్రికి ఝలక్ ఇచ్చింది. ఆయన స్థానంలో ఎలక్ట్రానిక్, ఐటీ మంత్రిగా రాజీవ్ చంద్రశేఖర్ ఇటీవలే బాధ్యతలు స్వీకరించారు.
రాజీవ్ చంద్రశేఖర్ ట్విటర్ ఖాతాలో బ్లూ వెరిఫైడ్ బ్యాడ్జిని హఠాత్తుగా తొలగించింది. భారత ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు ఖాతా నుంచి కూడా బ్లూ టిక్ ను తొలగించిన విషయం తెలిసిందే. తరచూ పోస్టింగ్ లు చేయకపోవడం మూలంగా బ్లూ టిక్ తొలగించినట్లు అప్పట్లో ట్విటర్ ప్రకటించింది. ఉప రాష్ట్రపతి కార్యాలయం స్పందించడంతో కొద్ది సేపటికే ట్విటర్ స్పందించి పునరుద్దరించింది. కాగా ఇంత వరకు మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ బ్లూ టిక్ ను పునరుద్దరించలేదు, ఆయన కూడా ఈ విషయమై అధికారికంగా స్పందించలేదు.