ట్విటర్ డౌన్… ఖాతాదారుల బేజారు!
న్యూఢిల్లీ: మైక్రో బ్లాగింగ్ ట్విటర్ సేవల్లో ఇవాళ ఉదయం కొద్దిసేపు అంతరాయం ఏర్పడింది. అకస్మాత్తుగా పనిచేయకపోవడంతో ఖాతాదారులు కంగుతిన్నారు. తమ ఫోన్ లో ఏమైనా లోపం ఉందా అని అనుమానపడ్డారు.
ట్విటర్ డౌన్ అంటూ సోషల్ మీడియాలో మెస్సేజిలు వెల్లువెత్తడంతో చాలా మంది ఊపిరిపీల్చుకున్నారు. వినియోగదారులకు తలెత్తిన ఈ సమస్యను పరిష్కరిస్తున్నట్లు ట్విటర్ ప్రకటించింది. ఇవాళ ఉదయం సుమారు గంట పాటు 8 గంటల సమయంలో అంతరాయం ఏర్పడినట్లు అవుటేజి మానిటరింగ్ వెబ్ ఫోర్టల్ వెల్లడించింది. ఒక్క దేశం అనేది కాకుండా పలు దేశాల్లో ఈ సమస్య తలెత్తినట్లు నెటిజన్లు కామెంట్లు పెట్టారు. తమ టైమ్ లైన్ వీక్షించడం సాధ్యం కాలేదని కొందరు, మరికొందరేమే సందేశాలు చూడలేకపోయామని పేర్కొన్నారు.