టిఆర్ఎస్ జంప్ జనార్ధన్ లు
హైదరాబాద్: టిఆర్ఎస్ పార్టీ నుంచి బిజెపి లోకి వెళ్లి కండువా కప్పుకుని, 24 గంటలు గడువక ముందే మళ్లీ టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు కౌన్సిలర్లు. ముగ్గురు దుబ్బాక కౌన్సిలర్లలో ఇద్దరు టిఆర్ఎస్ గూటికి తిరిగి చేరుకున్నారు.
ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్ రావు, ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి సమక్షంలో దుబ్బాక మున్సిపాల్టీకి చెందిన కౌన్సిలర్లు డి.బాలకృష్ణన, దివిటి కనకయ్యలు పార్టీలోకి చేరారు. మంగళవారం నాడు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు సమక్షంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డి సంజయ్ దుబ్బాక మున్సిపాల్టీకి చెందిన ముగ్గురు కౌన్సిలర్లు బిజెపిలోకి చేరారు. టిఆర్ఎస్ పార్టీ విధానాలు నచ్చకనే బిజెపిలోకి చేరుతున్నట్లు ముగ్గురు ప్రకటించారు. ఈరోజు హరీశ్ రావు సమక్షంలో మళ్లీ టిఆర్ఎస్ లోకి ఇద్దరు కౌన్సిలర్లు చేరారు. టిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి పనులు చేస్తున్నదని, ఎక్కడకి వెళ్లమని ఇద్దరు కౌన్సిలర్లు తెలిపారు.