దిగ్విజయంగా యునిటి-22 వ్యోమనౌక ప్రయాణం

వాషింగ్టన్: షెడ్యూలు ప్రకారం ఆదివారం సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభం కావాల్సిన అంతరిక్ష యాత్ర గంటన్నర ఆలస్యంగా ప్రారంభమైంది. 90 నిమిషాల పాటు జరగాల్సిన రోదసియానం 70 నిమిషాల్లోనే పూర్తి కావడం విశేషం.

ప్రపంచంలో అంతరిక్ష యానానికి అడుగులు పడుతున్నాయి. అంతరిక్ష పర్యటాటకంలో నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. అమెరికా కు చెందిన వర్జిన గెలాక్టిక్ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఆదివారం పంపించిన మావన సహిత వ్యోమనౌక విఎస్ఎస్ యూనిటి-22 ప్రయోగం విజయవంతమైంది. మిషన్ లో ప్రయాణించిన ఆరుగురు వ్యోమగాముల్లో వర్జిన్ గెలాక్టిక్ అధినేత రిచర్డ్ బ్రాన్ సన్ కూడా ఉన్నారు. న్యూ మెక్సికో లో వర్జిన్ గెలాక్టిక్ రూపొందించిన స్పేస్ పోర్టు అమెరికా లాంచింగ్ సెంటర్ నుంచి రోదసియాత్రను ప్రారంభించింది. సుమారు 70 నిమిషాల తరువాత వ్యోమగాములు తిరిగి రాత్రి 9.20 కు భూమ్మీదకు చేరుకున్నారు. ఈ యాత్రలో బ్రాన్సన్, శిరీషతో పాటు పైలట్ డేవ్ మెక్ కే, పైలట్ మైఖేల్ మాసుకి, ఆపరేషన్స్ ఇంజనీర్ కాలిన్ బెనెట్, వర్జిన్ గెలాక్టిక్ వ్యోమగామి ట్రైనర్ బెత్ మోసెస్ ఉన్నారు. ఏపిలోని గుంటూరు జిల్లాలో జన్మించిన బండ్ల శిరీష తల్లిదండ్రులతో హ్యూష్టన్ లో స్థిరపడింది. మిషన్ లో భాగమైనందుకు అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపింది. ప్రయోగం విజయవంతం కావంతో గుంటూరు జిల్లాలోని స్వగ్రామంలో సంబురాలు చేసుకున్నారు. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ అనుబంధ సంస్థ బూల ఆరిజన్ ఈ నెల 20వ తేదీన న్యూ షెఫర్డ్ వ్యోమనౌకను రోదసిలోకి పంపించనున్నది. ఇందులో సంస్థ యజమాని జెఫ్ బెజోస్ తోపాటు మరో ఐదుగురు ప్రయాణించనున్నారు. సుమారు 25 నిమిషాల పాటు రోదసిలో గడపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.