ట్రాఫిక్ రద్దీ… విసుగుతో నదిలో దూకేశాడు!

వాషింగ్టన్: సాధారణంగా ట్రాఫిక్ రద్దీ ఉంటే కారులో కూర్చుని పాటలు వింటుంటాం. బయటకు దిగి అటూ ఇటూ తిరుగుతాం కాని ఈ వ్యక్తి చేసిన వింత పనికి నెటిజన్లు షాక్ అవుతున్నారు.

లుసినాయానాకు చెందిన జిమ్మి ఇవాన్ జెన్నింగ్స్ కొద్ది రోజుల క్రితం నదిపై ఉన్న బ్రిడ్జిపై చిక్కుకున్నాడు. రెండు గంటలు దాటినా ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచి ఉన్నాయి. ఇప్పట్లో ట్రాఫిక్ సమస్య తీరదని భావించిన జిమ్మి పక్కనే ఉన్న నదిలోకి దూకేశాడు. అందులో మొసళ్లు ఉన్నట్లు ఆయనకు తెలియదు. మొసళ్లకు చిక్కిన అతను ఎలాగోలా ప్రాణాలతో బతికి బయటపడ్డాడు. దాదాపు గంటన్నర పాటు ఈదుతూ ప్రాణం మీద ఆశతో ఒక గ్రామంలోకి చేరుకున్నాడు. పోలీసులు అతన్ని అరెస్టు చేసి తీసుకువెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మొసళ్లు ఉన్న నదిలో దూకడం నేరం కావడంతో అతనిపై కేసు నమోదు చేసి ఇంటికి పంపించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు పెడుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.