ఇండియా నుంచి అతనే తొలి రోదసి యాత్రికుడు
ఇప్పటి వరకు మనం తీర్థయాత్రలు, పర్యాటక ప్రాంతాల పర్యటన చేశాం. ఇక నుంచి అంతరిక్ష యాత్రల గురించి చర్చించుకోవాల్సి ఉంటుంది. వర్జిన్ గెలాక్టిక్ వ్యోమ నౌక ఇటీవలే రోదసిలోకి వెళ్లి వచ్చింది.
కమర్షియల్ టూర్ ను ప్రారంభించేందుకు వర్జిన్ గెలాక్టిక్ ఏర్పాట్లు చేసుకుంటున్నది. భూమి నుంచి సుమారు 88 కిలోమీటర్ల వరకు రోదసిలో ప్రయాణం చేసి, అక్కడ భార రహిత స్థితిని అనుభూతి పొందిన తరువాత తిరిగి భూమ్మీదకు వస్తుంది. వర్జిన్ గెలాక్టిక్ అంతరిక్ష యాత్ర విజయవంతం కావడంతో ప్రయాణం చేసేందుకు పలువురు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇండియాలోని కేరళ రాష్ట్రానికి చెందిన టూరిస్టు సంతోష్ జార్జి వర్జిన్ గెలాక్టిక్ యాత్ర చేసేందుకు సన్నద్ధ మవుతున్నాడు. దీని కోసం ఆయన 2.5 లక్షల డాలర్లు కూడా చెల్లించుంకు ఏర్పాట్లు చేసుకున్నాడు. ఆయన ఇండియా నుంచి తొలి అంతరిక్ష పర్యాటకుడిగా గుర్తింపు దక్కించుకోబోతున్నారు. సంచారం పేరుతో ఆయన ఇప్పటి వరకు 1800 ఎపిసోడ్లను ప్రసారం చేశాడు. 130కి పైగా దేశాల్లో పర్యటించాడు. అంతరిక్ష ప్రయాణంలో తనతో పాటు కెమెరాను తీసుకువెళ్లి ఫొటోలు తీయనున్నట్లు సంతోష్ జార్జి తెలిపాడు.