టమాట లారీ బోల్తా… ట్రాఫిక్ జామ్

ముంబయి: థానే జిల్లాలో వర్షంతో రోడ్లు తడిసి ఉండడంతో టమాటలతో వెళ్తున్న పెద్ద లారీ అదుపు తప్పింది. బోర్లా పడడంతో లారీలో ఉన్న టమాట గంపలు చెల్లాచెదురుగా పడిపోయాయి. అందులోని టమాటలు కూడా చెల్లాచెదురుకావడంతో రోడ్డంతా నిండిపోయింది.

శుక్రవారం తెల్లవారు జామున జరిగిన ఈ ఘటనలో ఒకరు తీవ్రంగా గాయపడగా పలువురి వాహనదారులకు గాయాలయ్యాయి. దీంతో ట్రాఫిక్ పెద్ద ఎత్తున ఆగిపోవడంతో పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. ప్రొక్లెయినర్లను తెప్పించి రోడ్డుపై చెల్లచెదురైన టమాటలను తొలగించి ట్రిఫిక్ క్లియర్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.