నేటి స్పేస్ టూర్ సింగిల్ టికెట్ రూ.209 కోట్లు

వాషింగ్టన్: ఇప్పటికే గెలాక్టిక్ వర్జిన్ వ్యోమనౌక అంతరిక్షయానం చేసి సురక్షితంగా భూమికి చేరుకోగా, మరో సంస్థ అంతరిక్షయానం ఇవాళ నిర్వహించనున్నది. అమెజాన్ సంస్థ అధినేత మరో ముగ్గురితో కలిసి ఇవాళ అంతరిక్షంలోకి అడుగు పెట్టనున్నారు.
బ్లూ ఆరిజన్ సంస్థకు చెందిన న్యూ షెఫర్డ్ స్సేస్ క్రాఫ్ట్ ఇవాళ సాయంత్రం 6.30 గంటలకు పశ్చిమ టెక్సాస్ నుంచి బయలుదేరనున్నుది. అయితే ఇది అటానమస్ ఏయిర్ క్రాఫ్ట్ కాగా, పైలెట్ మాత్రం ఉండరు.

ఇందులో జెఫ్ బెజోస్ తో పాటు ఆయన సోదరుడు మార్క్, మరో ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురిలో మాజీ ఫైలట్ వాలీ ఫంక్ (82), అతి పిన్న వయస్సు వ్యక్తి అలివర్ డెమెన్ (18) ఉన్నారు. కొద్ది నిమిషాల పాటు సాగే అంతరిక్షయానానికి డెమెన్ రూ.209 కోట్లతో సీటు బుక్ చేసుకున్నాడు. రానున్న రోజుల్లో కమర్షియల్ టూర్ కోసం పలు అంతర్జాతీయ సంస్థలు పోటీపడుతున్నాయి. స్పేస్ క్రాఫ్ట్ లు మరిన్ని పెరిగితే టికెట్ ధరలు తగ్గడంతో పలువురు అంతరిక్షంలోకి వెళ్లేందుకు అవకాశం ఏర్పడుతుంది. ప్రజలను దగ్గరకు చేయడం కోసం అంతరిక్ష యాత్రలకు శ్రీకారం చుట్టారు. గత వారం గెలాక్టిక్ వర్జిన్ అధినేత రిచర్డ్ బ్రాన్సన్ భూమి పైకి వంద కిలోమీటర్ల వరకు వెళ్లి దిగ్విజయంగా తిరిగి వచ్చారు.

Leave A Reply

Your email address will not be published.