పాక్ లో మళ్లీ టిక్ టాక్ షురూ

ఇస్లామాబాద్: పాకిస్థాన్ లో టిక్ టాక్ యాప్ మళ్లీ తన సేవలను పునఃప్రారంభించింది. టిక్ టాక్ పై విధించిన నిషేదాన్ని ప్రొవిన్షియల్ కోర్టు ఎత్తివేయడంతో శనివారం నుంచి మళ్లీ వీక్షకుల ముందుకు వచ్చింది.

అయితే అభ్యంతరకర కంటెంట్ పై వస్తున్న ఫిర్యాదులను పరిష్కరించాలని కోర్టు ఆదేశించింది. ముఖ్యంగా ఆన్ లైన్ లో వస్తువులు విక్రయించేవారు ఎక్కువగా టిక్ టాక్ ను పాకిస్థాన్ లో ఉపయోగిస్తున్నారు. ముస్లిం చాందసవాద దేశమైన పాకిస్థాన్ లో మొదటి నుంచి వివాదాస్పదంగానే ఉంది. సెక్సువల్, అభ్యంతరకర, ట్రాన్స్ జెండర్, స్వలింగ కంటెంట్ ను ప్రమోట్ చేస్తుందన్న విమర్శలు ఉన్నాయి. ఇలాంటి కంటెంట్ కారణంగానే పాకిస్థాన్ రెండుసార్లు టిక్ టాక్ ను నిషేధించింది. ఈ మూడు నెలల కాలంలో అభ్యంతరకరంగా ఉన్న ఆరు మిలియన్లకు పైగా వీడియోలను తొలగించారు. ఇలాంటి కంటెంట్ ను తొలగిస్తామని హామీ ఇవ్వడంతో కోర్టు నిషేధం ఎత్తివేసింది. న్యాయపరమైన చిక్కులు తొలగిపోవడంతో శనివారం నుంచి మళ్లీ టిక్ టాక్ పాకిస్థాన్ లో తన సేవలను ప్రారంభించింది. వీక్షకులు, అభిమానులు మహానందంతో ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.