మూడేళ్లు సహజీవనం… మరో యువతితో పెళ్లి!

భోపాల్: ఏమైందో ఏమో ఆ యువతితో మూడేళ్లు సహజీవనం చేశాడు. కలిసి మెలిసి తిరిగారు. ప్రియురాలిని కాదని మరో యువతితో పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం తెలిసి ప్రియురాలు పెళ్లి మండపం వద్దకే వెళ్లింది. ఫంక్షన్ హాలు బయటి నుంచి ప్రియుడిని పిలిచి రోదించింది.
ఈ ఘటన హోసంగాబాద్ లో జరిగింది. కాన్పూర్ కు చెందిన యువతి ఉద్యోగ నిమిత్తం భోపాల్ లో ఉంటున్నది. తన సంస్థలోనే పనిచేసే యువకుడితో సహజీవనం చేసింది. మూడేళ్ల పాటు ఇద్దరూ కలిసి మెలిసి తిరిగారు. అతనికి ఈ మధ్యే తల్లిదండ్రులు వేరే అమ్మాయితో నిశ్చితార్థం చేసి, వివాహం జరిపారు.

వేరే అమ్మాయితో రహస్యంగా పెళ్లి చేసుకుంటున్నాడని తెలుసుకున్న ప్రియురాలు భోపాల్ లోని ఒక ఫంక్షన్ హాలుకు వెళ్లింది. లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా బంధువులు, సెక్యురిటీ గార్డు నిలిపివేశారు. బాబు… బాబు… బయటకు రా, నీ కోసం నేను వచ్చానంటూ రోదించింది. తనతో ఒక్కసారి మాట్లాడాలని వేడుకున్నది. యువతి పడుతున్న ఆరాటాన్ని, ఆవేదనను చూసిన పలువురు లోపలికి వెళ్లకుండా గట్టిగా పట్టుకున్నారు. తనతో మూడేళ్లు సహజీవనం చేశాడని, వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడని ఆరోపించింది. ఈ విషయం పోలీసులకు తెలియడంతో వారు ఫంక్షన్ హాలు వద్దకు చేరుకున్నారు. ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పగా, తన కుటుంబం పరువు పోతుంటూ అమ్మాయి అక్కడి నుంచి మౌనంగా వెళ్లిపోయింది. అక్కడి నుంచి తిరిగి భోపాల్ కు వెళ్లిపోయింది.

Leave A Reply

Your email address will not be published.