తెలుగు సైన్స్ ఫిక్షన్ మువీకి మూడు దశాబ్ధాలు

దర్శకుడు సింగీతం శ్రీనివాస రావు మూడు దశాబ్ధల క్రితమే టాలీవుడ్ లో సైన్స్ ఫిక్షన్ మువీ తీశారు. గ్రాఫిక్స్ అంతగా లేని రోజుల్లోనే ఆయన చేసిన సరికొత్త ప్రయోగం ప్రేక్షకులను విపరీతంగా ఆకర్షించింది.

అయితే ఈ సినిమా తీయడానికి ప్రముఖ గాయకుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ప్రోద్భలం ఎక్కువనే చెప్పాలి. బాలసుబ్రహ్మణ్యంతో సింగీతం శ్రీనివాస రావు భేటీ అయిన సందర్భంగా తన మనసులో ఉన్న టైమ్ ట్రావెల్ నేపథ్యంతో సినిమా తీస్తే ఎలా ఉంటుందని అడిగారు. దీనిపై ఇద్దరూ చర్చించుకున్న తరువాత ఇక ఆలస్యం వద్దని వెంటనే నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ ను కలవాల్సిందిగా కోరారు. ఇద్దరు కలిసి చర్చించుకుని సైన్స్ ఫిక్షన్ మువీని ట్రాక్ ఎక్కించారు. ఆదిత్య 369 మువీ ప్రత్యేక ఏంటంటే ఇప్పటి పరిస్థితులకు తగ్గట్టుగా ఉంటుంది. ఈ మువీ ఎప్పటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా అప్పటి రోజులకు అన్వయించుకునేలా కథనంతో తెరకెక్కించారు. దర్శకులు సింగీతం శ్రీనివాస రావు మూడు దశాబ్ధాల క్రితమే సైన్స్ ఫిక్షన్ మువీ తీసి శెహబాష్ అన్పించుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.