అతియా డేటింగ్ పై సునీల్ స్టేట్ మెంట్ ఇదీ

ఇండియా క్రికెట్ టీమ్ సభ్యుడు కెఎల్.రాహుల్ బాలీవుడ్ హీరోయిన్ అతియా శెట్టితో డేటింగ్ లో ఉన్నాడు. ఈ విషయమై వీళ్లిద్దరూ ఇప్పటి వరకు చెప్పకపోయినా క్రీడాభిమానులు కోడై కూస్తున్నారు.

ఇద్దరూ కలిసి కన్పిస్తుండడంతో వీరి మధ్య ఏదో ఉందనేది మాత్రం అందరికీ తెలిసిపోయింది. తరచూ ఇద్దరు కలిసి కన్పిస్తుండడంతో బంధం పెరిగిందని అభిమానులు అనుకుంటున్నారు. అతియా రాహుల్ తో కలిసి లండన్ లో ఉన్నది. ఆమె తండ్రి అయిన నటుడు సునీల్ శెట్టి మాత్రం మరో రకంగా చెబుతున్నాడు. ఆమె ఇంగ్లండ్ ఉన్నది కరెక్టే కాని సోదరుడు ఆహాన్ తో కలిసి హాలీడే ట్రిప్ కు వెళ్లిందని చెప్పాడు. కావాలంటే వాళ్లనే అడిగి తెలుసుకోవాలని చెప్పాడు. అయితే అతియా, రాహుల్ కలిసి ఒక ఐవేర్ బ్రాండ్ కు అంబాసిడర్లుగా ఉన్నారు. యాడ్ విషయానికి వస్తే వాళ్లిద్దరూ చాలా బాగా కన్పిస్తున్నారు, జంట బాగుంది కదా అని సునీల్ మీడియా ప్రతినిధులను ఎదురు ప్రశ్నించడం విశేషం.

Leave A Reply

Your email address will not be published.