థర్డ్ వేవ్ తప్పదు: ఇండియన్ మెడికల్ అసోసియేషన్

న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రజల కు షాక్ ఇచ్చేలా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ప్రకటన చేసింది. థర్డ్ వేవ్ తప్పదని, అది కూడా త్వరలోనే ప్రారంభమవుతుందని హెచ్చరించింది.

థర్డ్ వేవ్ వస్తుందని నిపుణులు చెబుతున్నా రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రజలు నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నారని, కరోనా నిబంధనలు పూర్తిగా ఉల్లంఘిస్తున్నారని ఐఎంఏ మండిపడింది. ఇతర ప్రాంతాల్లో పర్యటన, మత సంబంధ కార్యక్రమాలు, విందులు అవసరమే కాని వాటిని నిలువరించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. వ్యాక్సినేషన్ పూర్తి కాకుండా ఇలాంటి వాటిని నిర్వహించుకుంటే సూపర్ స్ప్రెడర్లు గా మారుతారని తేల్చింది. వ్యాక్సినేషన్ ద్వారానే తీవ్రత తగ్గించుకోవచ్చని, అదే సమయంలో భౌతిక దూరం, శానిటైజేషన్, మాస్క్ ధరించడం తప్పనిసరగా పాటించాలని ఐఏఎం ప్రజలను కోరింది.

Leave A Reply

Your email address will not be published.