మూడో వేవ్ వస్తోంది!: ఎస్.బి.ఐ

ముంబయి: ఇప్పుడిప్పుడకే సెకండ్ వేవ్ తీవ్రత తగ్గుముఖం పట్టి దేశ వ్యాప్త కేసుల నమోదు సంఖ్య 40వేలకు పడిపోయింది. హమ్మయ్య గండం నుంచి తప్పించుకుంటున్నామని ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో థర్డ్ వేవ్ పై ఎస్.బి.ఐ బాంబు పేల్చింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థతో సహా పలు సంస్థలు కరోనా వైరస్ మూడో ముప్పు ఉందని చెబుతునే ఉన్నాయి. ఈ నేపథ్యంలో థర్డ్ వేవ్ ప్రభావంపై ఎస్.బి.ఐ తాజా సర్వేలో కీలక అంశాలు వెల్లడయ్యాయి. ఆగస్టు నెలలో మొదలై సెప్టెంబర్ నెలలో తీవ్ర స్థాయికి చేరుకుంటాయని స్పష్టం చేసింది. ప్రస్తుతం జూలై రెండో వారంలో రోజుకు 10వేల కేసులు నమోదు కావచ్చని, ఆగస్టు 15వ తేదీ తరువాత మళ్లీ భారీగా పెరవచ్చని అంటున్నారు. గ్లోబల్ డేటా అంచనాల ప్రకారం సెకండ్ వేవ్ తో పోల్చితే థర్డ్ వేవ్ సగటు ఉధృత కేసులు 1.7 రేట్లు అధికంగా రానన్నాయి. ఆగస్టు 15 తరువాత మొదలై సెప్టెంబర్ 15 తరువాత శిఖ స్థాయికి చేరుకుంటాయి. కరోనా నిబంధనలు పాటించనట్లయితే అక్టోబర్-నవంబర్ మధ్య గరిష్ట స్థాయికి చేరుకుంటాయని ప్రభుత్వ నియమించిన ప్యానెల్ కూడా హెచ్చరించిన విషయం తెలిసిందే.

Leave A Reply

Your email address will not be published.