హుజూరాబాద్ కాంగ్రెస్ ఇన్చార్జీలు వీరే

హైదరాబాద్: హుజురాబాద్ అసెంబ్లీ ఇంఛార్జీలను సమన్వయ కర్తలను, మండల బాధ్యులను టిపిసిసి అధ్యక్షులు ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. హుజురాబాద్ అసెంబ్లీ ఇంచార్జి గా మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ వ్యవహరిస్తారు.
నియోజక ఎన్నికల సమన్వయకర్తలుగా ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే డి.శ్రీధర్ బాబు, మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్ ఉంటారు.

వీణవంక మండలం ఆది శ్రీనివాస్, సింగీతం శ్రీనివాస్, జమ్మికుంట మండలం విజయ రమణ రావు, రాజ్ మకాన్ ఠాగూర్, జమ్మికుంట టౌన్ మాజీ ఎంపి రాజయ్య, ఈర్ల కొమురయ్య, హుజురాబాద్ మండలం టి.నర్సారెడ్డి, లక్షణ్ కుమార్, హుజురాబాద్ టౌన్ బొమ్మ శ్రీరాం, జువ్వాడి నర్సింగరావు, ఇల్లంతకుంట మండలం నాయిని రాజేందర్ రెడ్డి, కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కమలపూర్ మండలం మాజీ మంత్రి కొండా సురేఖ, దొమ్మటి సాంబయ్య టారు. కంట్రోల్ రూమ్ సమన్వయకర్తగా కవ్వంపల్లి సత్యనారాయణ వ్యవహరిస్తారని ప్రకటించారు.

Leave A Reply

Your email address will not be published.