జైకోవ్-డి వ్యాక్సిన్ వస్తోంది…

12-18 వయస్సు పిల్లలకు కూడా వ్యాక్సిన్
న్యూఢిల్లీ: ఇప్పటికే మూడు వ్యాక్సిన్లు అందుబాటులోకి రాగా నాలుగో వ్యాక్సిన్ అనుమతి కోసం డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిజిఐ) కు దరఖాస్తు చేసుకున్నది.
అహ్మదాబాద్ కు చెందిన జైడస్ క్యాడిలా ఫార్మా కంపెనీ జైకోవ్-డి వ్యాక్సిన్ తయారు చేసింది. క్లినికల్ ట్రయ్స్ పూర్తి కావడంతో బహిరంగ మార్కెట్ లో అత్యవసర వినియోగం కింద అనుమతించాలని కేంద్రాన్ని కోరింది.

అనుమతి లభిస్తే ప్రతి ఏడాది 120 మిలియన్ డోసులు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నది. ఈ కంపెనీ 12-18 సంవత్సరాల మధ్యనున్న పిల్లలకు కూడా వ్యాక్సిన్లు తయారు చేసింది. 50కి పైగా ప్రాంతాల్లో 28వేల మంది చిన్నారి వాలంటీర్లపై ట్రయల్స్ నిర్వహించారు. కొత్త వేరియంట్లకు వ్యతిరేకంగా కూడా పనిచేస్తున్నట్లు వెల్లడైంది.

Leave A Reply

Your email address will not be published.