విగ్రహాలు నేలమట్టం… రాణి కాదు రాక్షసి
ఒట్టావా: బ్రిటిష్ ఏలుబడిలో జరిగిన మారణ హోమాన్ని గుర్తు చేసుకుంటూ కెనడా డే సందర్భంగా ఆ దేశ ప్రజలు ప్రతీకారాన్ని తీర్చుకున్నారు. రాణి కాదు రాక్షసి అంటూ క్వీన్ ఎలిజబెత్ విగ్రహాన్ని నేలమట్టం చేసి తొక్కి పారేశారు.
నిరసనకారులు నారింజ రంగు దస్తులతో రోడ్డెక్కి కన్పించిన బ్రిటిష్ విగ్రహాలను నేలకూల్చారు. ఇటీవల ఒక స్కూలులో చిన్న పిల్లల అస్థిపంజరాల అవశేషాలు కన్పించడంతో ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకున్నది. కెనడా డే సందర్భంగా ప్రజలు తమ కసి తీర్చుకున్నారు. విన్ని పెగ్ లో క్వీన్ విక్టోరియా విగ్రహం దగ్గర తొలుత ప్రదర్శలు నిర్వహించారు. దేశంలో బ్రిటిష్ రాచరికపు గుర్తులు ఉండకూడదని పెద్దగా నినాదాలు చేశారు. విగ్రహం పైకి ఎక్కి బ్రిటిష్ వ్యతిరేక నినాదాలు చేశారు. దగ్గర్లోనే ఉణ్న క్వీన్ ఎలిజబెత్ విగ్రహాన్ని కూడా తాళ్లతో లాగేసి తొక్కిపారేశారు.
ఈ ఘటనపై బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రతినిధి స్పందించారు. కెనడాలో జరిగిన విషాదాలకు మేం బాధపడుతున్నాం.
ఈ వ్యవహారంలో మేము విచారణకు సహకరిస్తామని ప్రకటించారు. విగ్రహాలను కూల్చేయడం, వాటిని తొక్కడ సరికాదన్నారు. కెనడా 165 ఏళ్ల పాటు బ్రిటిష్ పాలనలో మగ్గింది. బ్రిటిష్ కొలంబియా, సస్కట్చే వాన్ లో క్యాథలిక్ చర్చిల ద్వారా నడిచే స్కూళ్లలో భారీగా ఆస్థిపంజరాలు బయటపడ్డాయి. ఆ సమయంలో బలవంతపు మత మార్పిళ్లు, వినని వారిపై వేధింపులు జరిగాయని, మారణహోం పెద్ద ఎత్తున జరిగిందని కమిటీ నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ దురాగతాలపై కెనడియన్లు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అదను కోసం చూస్తున్న వారికి కెనడా డే అవకాశంగా రావడంతో బ్రిటిష్ పాలకుల విగ్రహాలను తుక్కుతుక్కు చేశారు.