ఆ రాష్ట్రంలో పండుగలు, ఉత్సవాలు నిషేధం
జైపూర్: సెకండ్ వేవ్ ముగియనే లేదు మళ్లీ థర్డ్ వేవ్ అంటూ అంతర్జాతీయ వైద్య నిపుణులు హెచ్చరిస్తుండడంతో రాజస్థాన్ ప్రభుత్వం అప్రమత్తమైంది. వైరస్ ను నిరోధించేందుకు మతపరమైన పండుగలు, ఉత్సవాలపై నిషేధం విధించింది.
త్వరలో జరగనున్న కన్వర్ యాత్ర, ఈదుల్ జుహా పండుగల సందర్భంగా మతపరమైన కార్యక్రామాలను నిర్వహించవద్దని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మధురో గోవర్థన ప్రాంతంలో జరిగే వార్షిక ముడియా పూనో మేళాను కూడా రద్దు చేశారు. చాతుర్మాస పండుగ సందర్భంగా భక్తులు గుమికూడవద్దని స్పష్టం చేసింది. ఏ మతం వారైనా తమ నివాసాల్లోనే పండుగలు, ఉత్సవాలు నిర్వహించుకుని కరోనా వైరస్ వ్యాప్తికి కారకులు కాకుండా చూడాలని ప్రజలను కోరింది. రాష్ట్రంలో శుక్రవారం నాడు 522 పాజిటివ్ కేసులు నమోదు కాగా ఇప్పటి వరకు 9,43,788 మందికి వైరస్ సోకింది. శుక్రవారం వరకు 8,947 మంది చనిపోయారు.