కొండచరియలు విరిగి 11 మంది మృతి
ముంబయి: రాష్ట్రంలో శనివారం నుంచి కుండపోతగా వర్షాలు కురుస్తుండడంతో పెను ప్రమాదం సంభవించింది. ముంబయిలోని చెంబూరు లో కొండ చరియలు విరిగి పడి 11 మంది చనిపోయారు. ఇప్పటి వరకు 13 మందిని రక్షించారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
చెంబూరు భరత్ నగర్ లోని శనివారం రాత్రి కొండ చరియలు విరిగిపడ్డాయి. కుండపోతగా వర్షాలు కురవడంతో నీటితో నాని నివాసాలపై పడడంతో అనేక ఇండ్లు కూలిపోయాయి. శనివారం సాయంత్రం స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు, ఎస్.డి.ఆర్.ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన భరత్ నగర్ కు చేరుకున్నారు. శిథిలాల నుంచి 11 మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం పంపించారు. 13 మందిని రక్షించి ఆసుపత్రులకు పంపించారు. క్షతగాత్రులు రాజవాడి ప్రాంతంలోని ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. విఖ్రోలి, సూర్యానగర్ ప్రాంతంలో కూడా వర్షాలు కురుస్తుండడంతో నాలుగు ఇండ్లు తడిసి కూలిపోయాయి.