ఒలింపిక్ విలేజీలో తొలి పాజిటివ్ కేసు

టోక్యో: ఒలింపిక్స్ క్రీడల సంరంభానికి జపాన్ సర్వసన్నద్ధమైంది. ప్రారంభోత్సవానికి మరో వారం రోజులే మిగిలి ఉండగా కరోనా పాజిటివ్ కేసు వెలుగు చూసింది. ఇవాళ తొలి పాజిటివ్ కేసు నమోదు కావడం క్రీడాకారులను ఆందోళనకు గురి చేస్తున్నది.
వేలాది మంది క్రీడాకారులు పాల్గొంటున్న ఒలింపిక్స్ లో వైరస్ ఎలా విజృంభిస్తుందోనంటూ నిర్వాహకులకు భయం పట్టుకున్నది.

ఈ క్రీడలను వాయిదా వేయాలని గత ఏడాది కాలంగా పలువురు క్రీడాభిమానులు కోరుతున్నా జపాన్ ప్రభుత్వం, నిర్వాహకులు ఏమాత్రం పట్టించుకోలేదు. ఇవాళ ఒలింపిక్స్ విలేజీలో స్క్రీనింగ్ టెస్టు నిర్వహిస్తున్న సమయంలో తొలి కేసు నిర్థారణ అయినట్లు నిర్వహణ కమిటీ ప్రతినిధి మాసా టకాయ తెలిపారు. గేమ్స్ నిర్వహణ కోసం వచ్చిన ఒక వ్యక్తి కి వైరస్ సోకిందని టోక్యో ఒలింపిక్స్ 2020 సిఈఒ తొషిరో ముటో వెల్లడించారు. అయితే ఆయన వివరాలు వెల్లడించేందుకు నిరాకరించారు. ఒలింపిక్స్ విలేజీలో సుమారు 11 వేల మంది అథ్లెట్లు బస చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.