కారు ధర రూ.9750… షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా

ప్రముఖ వాహన పరిశ్రమ యజమాని ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటాడు. వినూత్నమైన వార్తలు షేర్ చేసే విషయంలో ముందుంటారు. సమాజ సేవ చేసేవారిని, సంప్రదాయాలను పాటించేవారి పోస్టులను కూడా షేర్ చేస్తాడు.

తాజాగా తన ట్విటర్ అక్కౌంట్ లో షేర్ చేసిన పాత తరం కారు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నది. ఈ కారు ఫొటో నెట్టింట్లో దూసుకుపోతున్నది. ఈ కారు ధర రూ.9750 మాత్రమే. 1960లో ఫియట్ మోడల్ న్యూ 1100 కారు ధర రూ.9750 మాత్రమే. ఆహా… ఆ పాత అద్భుతమైన రోజులు అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. దీనిపై పలువురు నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు పెడుతున్నారు. ఈ ధరకే ఇప్పట్లో దొరికితే నాలుగైదు కొనేస్తారు. కారు కొనగలం కాని పెట్రోల్ పోయించడం మాత్రం సాధ్యం కాదంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.