అలియా ఆ పాటలో ఎప్పుడు చేస్తుందంటే!

పాన్ ఇండియా మువీ అయిన ఆర్ఆర్ఆర్ చిత్రం జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్ తో డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మాణం చేస్తున్నారు.

రెండు పాటు మినహా చిత్రీకరణ పూర్తయ్యింది. ఫీమేల్ లీడ్ రోల్ లో నటిస్తున్న అలియా భట్ సాంగ్ చిత్రీకరణలో ఎప్పుడు పాల్గొంటుందనే దానిపై ఒక న్యూస్ విన్పిస్తున్నది. ఈ పాటను హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణ చేసేందుకు దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ఏర్పాట్లు చేశారు. రూ. 3 కోట్లు ఖర్చు చేసి లీడ్ యాక్టర్లు, వందల మంది డ్యాన్సర్లతో కలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఈ పాటను షూట్ చేయనున్నారు. ఇందుకోసం అలియా ఈ నెలలో హైదరాబాద్ కు వస్తున్నది. దీంతో పాటుగా ఉక్రేయిన్ లో జూనియర్ ఎన్టీఆర్, ఒవిలియాతో డ్యుయట్ సాంగ్ చిత్రీకరించనున్నట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ రెండు పాటలు పూర్తయితే మువీ రిలీజు డేట్ ప్రకటించనున్నారు.

Leave A Reply

Your email address will not be published.