‘‘థాంక్యూ మోదీజి ఛాలెంజ్’’
న్యూఢిల్లీ: దేశంలో థాంక్యూ మోదీజి ఛాలెంజ్ ట్రెండ్ హోరెత్తిస్తున్నది. పెట్రోల్ బంకులలో మోదీ కటౌట్ ల ముందు పడుకుని దండాలు పెడుతున్నారు. మరికొందరు కారుపైకి ఎక్కి సాష్టాంగ నమస్కారాలు పెట్టి ట్విటర్ లో పోస్టు చేస్తున్నారు.
పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా థాంక్యూ మోదీజి ఛాలెంజ్ దుమ్మురేపుతున్నది.
ఎన్నడూ లేని విధంగా దేశంలో కొన్ని నగరాల్లో లీటర్ పెట్రోల్ రూ.100 దాటింది. డీజిల్ కూడా దాటింది. ఈ రేట్లను చూసిన జనం ఠారెత్తిపోతున్నారు. వీటి పెరుగుదల మూలంగా నిత్యావసర సరకుల ధరలకు రెక్కలొచ్చాయి. సామాన్య, మధ్యతరగతి ప్రజలు మోదీ పై బహిరంగంగా విమర్శలు గుప్పిస్తున్నారు.