ఏపి పాజిటివ్ కేసులు 2672
అమరావతి: ఆంధ్రాలో పెద్ద ఎత్తున కరోనా స్కీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. గత 24 గంటల్లో 2,672 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 18 మంది చనిపోయినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
తాజాగా 2,467 మంది కోలుకుని డిశ్చార్జీ కాగా ఇప్పటి వరకు మొత్తం పాజిటివ్ కేసులు 19,37,122 నమోదు అయ్యాయి. వీటిలో ఇప్పటి వరకు 18,98,966 మంది కోలుకున్నారు. ఇవ్వాల్టి వరకు 13,115 మంది వైరస్ కు బలయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 25,041 పాజిటివ్ కేసులు ఉన్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.