తెలంగాణ టిడిపి అధ్యక్షుడిగా నర్సింహులు
అమరావతి: తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులును నియమించారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం నుంచి గతంలో టిడిపి తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు.
తన రాజీకయ జీవితం ప్రారంభం నుంచి తెలుగుదేశం పార్టీలోనే నర్సింహులు ఉంటున్నారు. ఇవాళ అమరావతిలో పార్టీ అధినేత ఎన్.చంద్రబాబు నాయుడును బక్కని నర్సింహులు మర్యాదపూర్వకంగా కలిశారు. 1994 కాంగ్రెస్ అభ్యర్థి పి.శంకర్ రావుపై బక్కని నర్సింహులు గెలుపొందారు. పార్టీ అధ్యక్ష పదవికి ఎల్.రమణ్ రాజీనామా చేయడంతో ఖాళీ ఏర్పడింది. ఈ పదవి కోసం పలువురు పేర్లను చంద్రబాబు నాయుడు పరిశీలించినప్పటికీ చివరకు దళిత వర్గానికి చెందిన బక్కని నర్సింహులు వైపు మొగ్గు చూపారు.