వచ్చే ఏడాది తెలంగాణ ఎన్నికలు: రేవంత్ జోస్యం

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తన ప్రభుత్వాన్ని వచ్చే ఏడాది రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్తారని పిసిసి అధ్యక్షుడు ఏ.రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

గతంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లినట్లుగానే ఈ సారి కూడా వచ్చే ఏడాది 2022 ఆగస్టు 15 తరువాత కెసిఆర్ తన ప్రభుత్వాన్ని రద్దు చేస్తారని అన్నారు. రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కెటిఆర్ ను ముఖ్యమంత్రి సీట్లో కెసిఆర్ కూర్చోబెట్టరన్నారు. తనపై విమర్శలు చేస్తున్న ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్ రావుపై రేవంత్ రెడ్డి మండిపడ్డారు. నేను తెలుగుదేశం పార్టీ అయితే కెసిఆర్ ఏ పార్టీ నుంచి వచ్చారని ప్రశ్నించారు. కెసిఆర్ టిఆర్ఎస్ కు ఎలా అధ్యక్షుడో నేను కూడా తెలంగాణ కాంగ్రెస్ కు అధ్యక్షుడనని అన్నారు. కెసిఆర్ మంత్రి వర్గంలో 75 శాతం మంది టిడిపి వారే ఉన్నారన్నారు. మంత్రులు హరీశ్ రావు, కెటిఆర్ కు రాజకీయ బిక్ష పెట్టింది కాంగ్రెస్ కాదా అని ఆయన అడిగారు. టి కాంగ్రెస్ టిడిపి అయితే టిఆర్ఎస్ కూడా టి టిడిపినే అని అన్నారు. టిఆర్ఎస్ నుంచి బరాబర్ అధికారం గుంజుకుంటామని రేవంత్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.