బాబా మంచి వాడంట.. టీచర్ల పోస్టులు?

చెన్నై: పోలీసుల రిమాండ్ లో ఉన్న శివశంకర్ బాబా ఉత్తముడు అని, గొప్పవాడు అని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న ఐదుగురు లేడీ టీచర్లపై తమిళనాడు పోలీసులు కేసు పెట్టారు.
సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వీరిని విచారించేందుకు నోటీసులు పంపించినా స్పందించలేదు. అరెస్టు చేసేందుకు వారి ఇళ్లకు వెళ్లగా తాళాలు వేసి పరారయ్యారు. చెన్నై నగరం సమీపంలోని కేళంబాక్కంలోని సుశీల్ హరి స్కూలు కరస్పాండంట్ శివ శంకర్ బాబా పై పోలీసులు ఫోక్సో కేసులు నమోదు చేశారు.

చదువుకునే రోజుల్లో తమను లైంగికంగా వేధించాడంటూ పూర్వ విద్యార్థులు ఫిర్యాదు చేయడంతో గుట్టు రట్టయింది. ఫొక్సో చట్టం కింద ఆయనను అరెస్టు చేయగా, పూర్తి స్థాయిలో విచారించేందుకు సిబిసిఐడికి అప్పగించారు. బెయిల్ కోసం అనేకసార్లు పిటిషన్ వేసినప్పటికీ మంజూరు కాలేదు. ఈ నెల 13న బెయిల్ కోసం పిటిషన్ వేయగా, న్యాయమూర్తి రిమాండ్ గడువు 27 వరకు పొడిగించారు. ఇదిలా ఉండగానే స్కూలు కు చెందిన ఐదుగురు టీచర్లు బాబాను పొగుడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ పోస్టులను చూసిన పూర్వ విద్యార్థులు, పోలీసులు కంగుతిన్నారు. బాబాకు మద్ధతుగా ప్రచారం చేస్తున్న వీరిని విచారించేందుకు సిబిసిఐడి పోలీసులు ఐదుగురు లేడీ టీచర్లకు నోటీసులు పంపించారు. ఈ నెల 19న హాజరు కావాలని నోటీసులు ఇచ్చేందుకు వెళ్లగా ఇళ్లకు తాళాలు వేసి ఉన్నాయి. వారి ఇళ్లపై నోటీసులు అంటించి, ముమ్మరంగా గాలిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.