నిన్న స్వీపర్… నేడు డిప్యూటీ కలెక్టర్

జైపూర్: ఎన్ని ఉద్యోగాల కోసం పరీక్ష రాసినా రాకపోవడంతో చివరకు స్వీపర్ ఉద్యోగంలో చేరింది. అయినా పట్టు విడవకుండా చదివి డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం సంపాధించి నలుగురికి ఆదర్శంగా నిలిచింది. ఆమె పేరే ఆశా.

జోధ్ పూర్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఆశా స్వీపర్ గా పనిచేస్తున్నది. వీధులు ఉడ్చుతూ, తన ఇద్రది సంతానాన్ని చదివిస్తూ అనుకున్న లక్ష్యాన్ని సాధించింది. రెండు సంవత్సరాల క్రితం రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసు పరీక్ష రాసింది. ఆ పరీక్షా ఫలితాలను తాజాగా వెలువరించగా, ఆమె ఉత్తీర్ణత సాధించింది. ఆమె సాధించిన మార్కుల ఆధారంగా త్వరలో ఆమెకు డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఇవ్వనున్నారు. ఎనిమిది సంవత్సరాల క్రితం భర్త నుంచి విడిపోయి వేరుగా ఉంటున్నది. తన ఇద్దరు పిల్లలను పెంచుకుంటూ, డిగ్రీ పూర్తి చేసింది. స్వీపర్ గా పనిచేస్తూ, పరీక్షలకు ప్రిపేర్ అయి ఉన్నత ఉద్యోగాన్ని దక్కించుకున్నది. సహచర ఉద్యోగులు ఆమె పట్టుదలను అభినందించారు.

Leave A Reply

Your email address will not be published.