యాదగిరిగుట్టలో స్వాతి నక్షత్ర పూజలు
యాదాద్రి: శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ఆదివారం స్వామివారి కి స్వాతి పూజారులు నక్షత్ర పూజలు నిర్వహించారు. స్వామి వారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం కావడంతో ఆదివారం వేకువ జాము నుంచే పూజలు మొదలు పెట్టారు.
ఇవాళ వేకువ జామునే స్వయంభువులను కొలిచిన అర్చకులను బాలాలయంలోకి కవచ మూర్తులకు అష్ణోత్తర శతఘటాభిషేక పూజలు నిర్వహించారు. అంతకు ముందు ఆలయ కల్యాణ మండంలో 108 కలశాలకు పూజలు నిర్వహించారు. పంచసూత్ర పఠనంతో హోమం నిర్వహించి ఉత్సవ మూర్తులను, ప్రతిష్ట అలంకార మూర్తులకు అభిషేకం చేశారు. తులసి దళంతో సహస్ర నామార్చనలు చేశారు. ఇవాళ సాయంత్రం అమ్మవార్లను రథసేవలో తీర్చిదిద్ది బాలాలయ మండపంలో ఊరేగించనున్నారు.