కత్తి మహేశ్ మృతిపై అనుమానాలు: మందకృష్ణ మాదిగ
చిత్తూరు: సినీ విమర్శకుడు కత్తి మహేశ్ మృతిపై ఆయన తండ్రి ఓబులేషు తో పాటు ఎం.ఆర్.పి.ఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అనుమానాలు వ్యక్తం చేశారు. ఆయన మృతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఏపి ప్రభుత్వాన్ని కోరారు.
నెల్లూరు సమీపంలో జరిగిన కారు ప్రమాదంలో మహేశ్ తీవ్ర గాయాల పాలై చెన్నైలోని అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందారు. చికిత్స తీసుకుంటూ చనిపోయిన ఆయనకు సోమవారం నాడు చిత్తూరు జిల్లా యర్రావారి పాలెం మండలం యలమందలో అంత్యక్రియలు జరిగాయి. అపోలో హాస్పిటల్ యాజమాన్యం తమకన్నా ముందుగా బయటి వారికి ఆయన చనిపోయినట్లు సమాచారం ఇచ్చారని తండ్రి ఓబులేషు ఆరోపించారు. వయసు రీత్యా తన శరీరం సహకరించడం లేదని, ప్రభుత్వమే తమకు న్యాయం చేయాలని ఓబులేషు కోరారు.