కోకాపేట భూముల వేలానికి సూపర్ రెస్పాన్స్?

హైదరాబాద్: నిధులు సమకూర్చుకునేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) కోకాపేటలో భూములకు వేలం పాట నిర్వహించింది. ఈ వేలం పాటకు అపూర్వ స్పందన లభించిందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
రంగారెడ్డి జిల్లా కోకాపేటలో 41 ఎకరాలకు చెందిన 8 ప్లాట్లను వేలం వేశారు. ఆన్ లైన్ వేలం వేసేందుకు ఈరోజు ఖరారు చేశారు.

ఒక్క ఎకరా కనీస ధర రూ.25 కోట్లు నిర్ణయించారు. ఆ పై ఎవరు ఎక్కువ మొత్తం చెల్లిస్తే వారికి భూమి కేటాయిస్తారు. ఆన్ లైన్ వేలం పాటలో ఈరోజు మొత్తం 60 మంది పాల్గొన్నారు. కనీస ప్రారంభ ధర రూ.50 కోట్ల వరకు వెళ్లినట్లు చెబుతున్నారు. రేపు ఖానా మెట్ లో భూములను ఆన్ లైన్ లో వేలం వేయనున్నారు. వైఎస్.రాజశేఖర రెడ్డి తొలిసారి ముఖ్యమంత్రి అయిన తరువాత గోల్డెన్ మైల్ ప్రాజెక్టు పేరుతో కోకాపేటలో పెద్ద ఎత్తున భూములు వేలం వేశారు. ఈ వేలం పాటలో అప్పట్లో హెచ్ఎండిఏ కు రూ.750 కోట్లు సమకూరాయి.

Leave A Reply

Your email address will not be published.