వర్క్ ఫ్రమ్ ఆఫీసు పై సాఫ్ట్ వేర్ ఉద్యోగుల గుర్రు

సెకండ్ వేవ్ తగ్గనే లేదు… థర్డ్ వేవ్ వస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఇంకా వైరస్ భయం ప్రజలను వీడలేదు. ఈ నేపథ్యంలో పలు సాఫ్ట్ వేర్ దిగ్గజ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ కు అవకాశాలు ఇచ్చాయి.
వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగం పెరగడంతో పలు కంపెనీలు పునరాలోచనలో పడ్డాయి. తిరిగి సెప్టెంబర్ నెల నుంచి ఆఫీసులు తెరవాలని కంపెనీలు నిర్ణయించడం పట్ల ఉద్యోగులు మండిపడుతున్నారు. దిగ్గజ సంస్థలు యాపిల్, గూగుల్ తమ ఉద్యోగులను తిరిగి విధులకు సిద్ధం కావాలని మెయిల్స్ పంపిస్తున్నాయి. దీనిపై ఉద్యోగులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తాము వర్క్ ఫ్రమ్ హోమ్ కే పరిమితం అవుతామని, ఆఫీసుకు రాలేమని తేల్చి చెబుతున్నారు.

ఆఫీసులకు రావాలని గట్టిగా ఆదేశిస్తే రాజీనామా చేస్తామని హెచ్చరిస్తున్నారు. సెప్టెంబర్ 1 నుంచి ప్రతి వారంలో మూడు రోజులు ఆఫీసుకు ఉద్యోగులు రావాలని యాపిల్ సిఈఒ టిమ్ కుక్ ఆదేశించారు. ఎక్కువ శాతం మంది వచ్చేందుకు నిరాకరిస్తున్నా, రావాల్సిందేనని సంస్థ స్పష్టం చేసింది.
గత నెలలో సర్వే నిర్వహించగా 90 శాతం మంది తాము ఇంటి నుంచే పనిచేస్తామని అభిప్రాయాన్ని వెల్లడించారు. మరికొందరు కోర్టుకు వెళ్లే ఆలోచన చేస్తున్నారు. అదే విధంగా గూగుల్ ఉద్యగులు కూడా గుర్రుగా ఉన్నారు. సెప్టెంబర్ మొదటి వారం నుంచి 60 శాతం ఉద్యోగులు ఆఫీసులకు రావాలని ఆదేశించింది. వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి చేసే వారికి లోకేషన టూల్ ఆధారంగా జీతాలు ఉంటాయని తెలిపింది. అయినప్పటికీ చాలా మంది ఆఫీసు రావడం కుదరదన్నారు. దీనిపై గూగుల్, యాపిల్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాయో చూడాలి మరి.

Leave A Reply

Your email address will not be published.