సింగర్ పేరుతో సోషల్ మీడియా… వేధింపులు!

హైదరాబాద్: ప్రముఖ సింగర్ పేరుతో సోషల్ మీడియాలో అక్కౌంట్లు తెరిచి, అశ్లీల కంటెంట్ ను అప్ లోడ్ చేస్తున్న నిందితుడు రాచకొండ పోలీసులకు పట్టుబడ్డాడు. కర్ణాటకకు చెందిన నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

సింగర్ పేరుతో ఫేస్ బుక్, ఇన్ స్టా, యూ ట్యూబ్ లో కర్ణాటకకు చెందిన మేడికాయల నవీన్ అక్కౌంట్లు ఓపెన్ చేశాడు. ఆమె బొమ్మలను ఉపయోగించి అశ్లీల, బూతు కంటెంట్ ను అప్ లోడ్ చేస్తున్నాడు. అంతే కాకుండా ఆమె పేరుతో ఫిల్మ్ ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేశాడు. ఈ విషయం తెలిసిన వారి ద్వారా సింగర్ కు తెలియడంతో షాక్ కు గురైంది. వెంటనే నవీన్ కు ఫోన్ చేసి వాటిని తొలగించాల్సిందిగా కోరారు. ఎంతకు విన్పించుకోకపోవడంతో సింగర్ రాచకొండ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడు మేడికాయల నవీన్ ను అరెస్టు చేసి రిమాండ్ కు పంపించారు.

Leave A Reply

Your email address will not be published.