ఒకే ఆఫీసు… భర్త స్వీపర్ భార్య చీఫ్

లక్నో: దురదృష్ణం అంటే ఇదేనేమో మరి. తను పనిచేస్తున్న కార్యాలయంలో భార్య తనకు చీఫ్ గా వస్తుందని భర్త కలలో కూడా ఊహించకపోవచ్చు. కాని బలియా ఖేరి బ్లాక్ ఆఫీసులో అక్షరాలా జరిగింది.

బలియా ఖేరి బ్లాక్ లోని 55వ వార్డు నుంచి సోనియా (26) అనే మహిళ బిజెపి నుంచి గెలుపొందింది. ఆ తరువాత జరిగిన బ్లాక్ డెవలప్ మెంట్ చీఫ్ ఎన్నికలు జరగ్గా, సోనియాను ఎంపిక చేసింది పార్టీ నాయకత్వం. విద్యావంతురాలు, మహిళ కావడంతో ఆమెను బరిలో పెట్టగా సునాయసంగా చీఫ్ గా గెలుపొందింది. అయితే అదే ఆఫీసులో భర్త సునీల్ కుమార్ స్వీపర్ గా పనిచేస్తున్నాడు. తన భార్య చీఫ్ గా ఉన్నా తను స్వీపర్ గా పనిచేస్తానని ఆయన చెప్పుకొచ్చారు. తన భర్త సునీల్, కుటుంబం మద్ధతుతోనే ఈ ఎన్నికల్లో విజయం సాధించానని, బ్లాక్ అభివృద్ధికి తనవంతు పనిచేస్తానని సోనియా తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.