సింహాచలం భూములు ఆక్రమణ కాలేదు…
అమరావతి: సింహాచలం దేవస్థానం భూముల అక్రమాల ఆరోపణల్లో స్పష్టత లేదని మాజీ కేంద్ర మంత్రి, మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ పి.అశోక్ గజపతిరాజు స్పష్టం చేశారు. 700 ఎకరాలు అన్యాక్రాంతం అంటే చిన్న విషయం కాదన్నారు.
అశోక్ గజపతి రాజు ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. సింహాచలం భూముల అక్రమాల ఆరోపణలపై స్పష్టత లేదని అన్నారు. భూముల ఆక్రమణలపై ఇంత వరకుఆధారాలు ఇవ్వడం లేదు.. కనీసం సర్వే నెంబర్లు కూడా ఇవ్వలేదన్నారు. ఆలయాల భూముల పర్యవేక్షణకు అన్యమతస్తులను నియమిస్తున్నారు. బెయిల్‌పై ఉన్న దొంగను సింహాచలం భూములకు చైర్మన్ చేశారని ఆరోపించారు. ఆ దొంగ సింహాచలం భూములు 500 ఎకరాలు తీసుకొని వేరే చోట ఇస్తారని చెబుతున్నాడన్నారు. మాన్సాస్‌లో ప్రభుత్వం వేలుపెట్టి శాశ్వతంగా డ్యామేజ్ చేసింది. 16 ఏళ్ల పాటు ఆడిట్ జరగలేదనడం సరికాదు.. ఆడిట్ జరిగినా అప్డేట్ చేయలేదన్నారు. మాన్సాస్ విద్యా సంస్థల ఆడిట్ జరిగిందని, వివరాలు సమర్పించామని అశోక్ గజపతిరాజు వెల్లడించారు.