కాశ్మీర్ లో ఎన్ కౌంటర్

శ్రీనగర్: పోషియాన్ జిల్లాలో సోమవారం తెల్లవారు జామున భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు నడుమ ఎదురు కాల్పలు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో లష్కరే తోయిబా కమాండర్ తో పాటు ఇద్దరు ఉగ్రవాదులు చనిపోయారు.
పోషియాన్ లోని చెక్ సాదిఖ్ ఖాన్ ప్రాంతంలో టెర్రరిస్టులు ఉన్నారని ఇంటెలీజెన్స్ వర్గాలకు పక్కా సమాచారం అందింది. భద్రతా బలగాలు పోలీసులతో కలిసి సోమవారం తెల్లవారు జామున పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టాయి. పోలీసులు వచ్చారని పసిగట్టిన టెర్రరిస్టులు కాల్పులు జరపగా, ప్రతిగా భద్రతా బలగాలు కూడా కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో లష్కరే తోయిబా కమాండర్ ఇష్పాక్ దార్ అలియాస్ అబూ అక్రమ్ తో పాటు మరో ఇద్దరు టెర్రరిస్టులు చనిపోయారని కాశ్మీర్ ఐజి విజయ్ కుమార్ తెలిపారు. అబూ అక్రమ్ కాశ్మీర్ లో 2017 నుంచి ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడని ఆయన తెలిపారు. మరికొందరు ఉన్నారనే ప్రాథమిక సమాచారంతో ఆ ప్రాంతంలో భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి. మరో 24 గంటల పాటు ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు ఉంటాయని ఐజి విజయ్ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.