వచ్చేవారం చిన్నారుల వ్యాక్సిన్ రెండో ట్రయల్స్

న్యూఢిల్లీ: థర్డ్ వేవ్ చిన్నారులపై ప్రతాపం చూపిస్తుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో భారత్ బయోటెక్ చిన్నారుల వ్యాక్సిన్ తయారు చేసింది. ఇప్పటికే ఫస్ట్ డోస్ ఇచ్చి క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించారు.

వచ్చేవారం రెండు నుంచి ఆరేళ్ల లోపు చిన్నారులకు సెకండ్ డోసు ఇవ్వనున్నారు. ఢిల్లీలోని ఏయిమ్స్ లో క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా ఇప్పటికే 6 నుంచి 12 సంవత్సరాల వయస్సు పిల్లలకు వ్యాక్సిన్ సెకండ్ డోసు ఇచ్చారు. వీరి రిపోర్టులు రావాల్సి ఉంది. నిర్ణీత గడువు దాటిన తరువాత యాంటీబాడీలు ఎలా అభివృద్ధి చెందాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా, ఇతరత్రా సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే పరిగణనలోకి తీసుకోనున్నారు. క్లినికల్ ట్రయల్స్ లో పాల్గొన్న పిల్లల నుంచి ఎప్పటికప్పుడు ఆరోగ్య వివరాలు సేకరిస్తున్నారు. భారత్ బయోటెక్ తో పాటు జైడస్ క్యాడిలా కంపెనీ కూడా చిన్నారులపై వ్యాక్సిన్ ట్రయల్స్ ప్రారంభించింది. ఈ కంపెనీ కూడా ఇదే నెలలో సెకండ్ డోసు ప్రయోగించనున్నది. ఆగస్టు నెలలో కేంద్రానికి నివేదిక సమర్పించి అనుమతులు తీసుకోనున్నది.

 

Leave A Reply

Your email address will not be published.