రూ.400కే కరోనా టెస్టు కిట్

హైదరాబాద్: కరోనా వైరస్ పై విజయం సాధించేందుకు వ్యాక్సిన్లతో పాటు కిట్ లపై ఏడాది కాలంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఇంట్లోనే టెస్టు చేసుకునేందుకు ఒకటి రెండు కిట్లు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి.

కాగా హైదరాబాద్ ఐఐటి ప్రొఫెసర్ శివ్ గోవింద్ సింగ్ కొత్త తరహా కరోనా టెస్టింగ్ కిట్ రూపొందించారు. ఆర్.టి.పి.సి.ఆర్ టెస్టుతో సమానంగా ఈ కిట్ పనిచేస్తుందని ఆయన తెలిపారు. తాను రూపొందించిన కోవీ హోమ్ కిట్ తో కేవలం అరగంటలో రిజల్టు వస్తుందన్నారు. నిపుణుల పర్యవేక్షణ లేకుండానే ఈ పరీక్ష చేసుకోవచ్చన్నారు. దీన్ని అభివృద్ధి పర్చిన పరిశోధన బృందంలో డాక్టర్ సూర్యస్నాట త్రిపాఠి, సుప్రజా పట్ట, స్వాతి మొహంతి ఉన్నారు. ఒక కిట్ ధర రూ.400 గా నిర్ణయించామని, భారీ స్థాయిలో తయారీ చేసి విక్రయించేందుకు భాగస్వాములను చూస్తున్నామన్నారు. చాలా తక్కువ ధరతో రూపొందించిన కిట్ తో ఇంటిలోనే పరీక్ష్ చేసుకోవచ్చని శివ్ గోవింద్ సింగ్ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.