అభిమాని కుటుంబానికి రూ.2 లక్షల సాయం
మెగా హీరో వరుణ్ తేజ్ అభిమానుల పట్ల తనకున్న ప్రత్యేక శ్రద్ధను తెలియచేశారు. కరోనా వైరస్ సోకి మరణించిన ఒక అభిమాని కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు.
కరీంనగర్ కు చెందిన శేఖర్ వరుణ్ తేజ్ కు వీరాభిమాని.
ఇటీవలే కరోనా వైరస్ సోకి చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ విషయం అభిమానులు వరుణ్ తేజ్ కు తెలియచేశారు. వరుణ్ సూచన మేరకు కరీంనగర్ జిల్లా మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వేల్పుల వెంకటేశ్, శేఖర్ కుటుంబానికి రూ.2 లక్షల చెక్కును అందచేశారు. ఈ సందర్భంగా శేఖర్ తల్లి హీరో వరుణ్ కు ధన్యవాదాలు తెలిపారు.