కత్తి మహేష్ కు రూ.17 లక్షల సాయం
అమరావతి: ఫిల్మ్ క్రిటిక్ కత్తి మహేష్ వైద్య చికిత్స కోసం ఏపి సిఎం వైఎస్.జగన్ మోహన్ రెడ్డి రూ.17 లక్షలు సిఎంఆర్ఎఫ్ కింద ఆర్థికసాయం మంజూరు చేశారు. ఈ మొత్తాన్ని చెన్నై అపోలో ఆసుపత్రికి పంపించారు.
నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖర పురం వద్ద రోడ్డు ప్రమాదంలో గాయపడి చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కంటికి శస్త్ర చికిత్సలు చేయగా, పూర్తి కోలుకునేందుకు మరికొద్ది రోజులు పడుతుందని అపోలో వైద్యులు తెలిపారు. వైద్య ఖర్చుల కోసం ఆయన మిత్రులు కూడా కొన్ని నిధులు సేకరించారు.